శ్రీల ప్రభుపాదులుగా తదనంతరము తెలియబడినట్టి కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి వారి ప్రపంచ ప్రఖ్యాతి 1965వ సంవత్సరము . తరువాత, అంటే ఆయన అమెరికాకు వెళ్ళిన తరువాత కలిగింది. భారతదేశము నుండి బయలుదేరడానికి ముందు ఆయన మూడు గ్రంథాలు వ్రాసారు; కాని తరువాతి పన్నెండేళ్ళలో ఆయన అరవైకి పైగా పుస్తకాలు వ్రాసారు. భారతదేశాన్ని విడిచి వెళ్ళడానికి ముందు ఆయన ఒక శిష్యునికి దీక్ష ఇచ్చారు. కాని తరువాతి పన్నెండు సంవత్సరాలలో ఆయన నాలుగువేలకు పైగా దీక్షలు ఇచ్చారు. ప్రపంచవ్యాప్త కృష్ణభక్తుల సంఘాన్ని స్థాపించాలనే తమ లక్ష్యాన్ని ఆయన నెరవేర్చుకుంటారని భారతదేశము నుండి బయలుదేరడానికి ముందు ఒక్కరైనా నమ్మలేకపోయారు. కాని తదుపరి దశాబ్ద కాలంలో ఆయన అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘాన్ని స్థాపించి, కొనసాగించి వందకు పైగా మందిరాలను నిర్మించగలిగారు. అమెరికాకు ప్రయాణించడానికి ముందు ఆయన ఏనాడూ భారతదేశాన్ని దాటి పోలేదు. కాని తరువాత పన్నెండు సంవత్సరాలలో ఆయన కృష్ణచైతన్యోద్యమాన్ని విస్తృతపరుస్తూ ప్రపంచము చుట్టూ అనేకమార్లు పర్యటించారు.
ఆయన జీవితంలో సాధించినవి ఆలస్యంగా కలిగిన విప్లవాత్మకమైన ఆధ్యాత్మిక విజయాలుగా కనిపించినప్పటికీ ఆయన జీవితంలోని తొలి అరవైతొమ్మిది సంవత్సరాలు ఆ విజయాలకు సన్నాహము వంటివే అవుతాయి. అమెరికా దేశస్థులకు శ్రీల ప్రభుపాదులు, ఆయన ఉపదేశాలు అకస్మాత్తుగా ప్రకటమైనవిగా, అంటే అల్లాఉద్దీన్ అద్భుతదీపం నుండి ప్రకటమైనట్టి శక్తిగా కనిపించినప్పటికీ వందలాది సంవత్సరాల సాంస్కృతిక సంప్రదాయానికి ఆయన దక్షత కలిగిన ప్రతినిధి వంటివారే అయియున్నారు.
శ్రీల ప్రభుపాదులు (అభయచరణ్ డే) సెప్టెంబర్ 1, 1896 తేదీన కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి గౌరమోహన్ డే. ఆయన ఒక బట్టల వ్యాపారి. ఆయన తల్లి పేరు రజని, బెంగాలీ సంప్రదాయము ప్రకారము ఆ తల్లిదండ్రులు తమ పిల్లవాని జాతకచక్రం వేయడానికి ఒక జ్యోతిష్కుని పిలిపించారు. జ్యోతిషక్రాన్ని
Reviews
There are no reviews yet.